ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిసున్న ట్రాఫిక్ పోలీసులు

ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిసున్న ట్రాఫిక్ పోలీసులు
  • ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో అవేర్​నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిసున్న ట్రాఫిక్ పోలీసులు
  • ట్రాఫిక్ రూల్స్‌‌‌‌, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన
  • కాంపిటీషన్స్ నిర్వహించి స్టూడెంట్లకు గిఫ్ట్ ప్రైజ్​లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. వాహనదారులతో పాటు స్టూడెంట్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగిస్తున్నారు. గతేడాది కాలేజీ స్టూడెంట్లకు అవేర్ నెస్ ప్రోగ్రామ్​లు నిర్వహించగా.. ఈ ఏడాది స్కూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో స్కూల్ స్టూడెంట్లకు ట్రాఫిక్ రూల్స్​పై క్లాసులు చెప్పడంతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా స్కూల్ మేనేజ్ మెంట్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్కూల్ బస్సు కండీషన్​లో ఉండటం, ఎక్స్ పీరియన్స్ ఉన్న డ్రైవర్​ను నియమించుకోవడం, బస్సులో అటెండర్ తప్పనిసరిగా ఉండేలా స్కూల్ మేనేజ్​మెంట్లు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

రెగ్యులర్ క్లాసెస్ తరహాలోనే..

ట్రాఫిక్ పోలీసుల సూచనలతో ప్రైవేట్ స్కూల్ మేనేజ్​మెంట్లు స్టూడెంట్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాయి. రెగ్యులర్ క్లాసెస్ తరహాలోనే ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి టీచర్లు అన్ని తరగతుల స్టూడెంట్లకు బోధిస్తున్నారు. రూల్స్ పాటించకపోతే కలిగే ప్రమాదాల గురించి వివరిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌‌‌‌ ఎలా పనిచేస్తాయో, వాటిని ఎలా ఆపరేట్​ చేస్తారనే వివరాలను వెల్లడిస్తున్నారు. రెడ్‌‌‌‌, గ్రీన్‌‌‌‌, ఎల్లో లైట్లు పడిన సమయాల్లో వెహికల్ మూవ్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఎలా ఉంటుందో చెబుతున్నారు. ట్రాఫిక్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌పై చిన్నారులకు డిజిటల్, క్రాఫ్ట్ కాంపిటీషన్స్‌‌‌‌ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్స్‌‌‌‌ విజిట్‌‌‌‌ చేసేందుకు స్టూడెంట్లను టీచర్లు స్టడీ టూర్లకు తీసుకెళ్తున్నారు.

కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్​కు వివరించేలా..

స్కూల్‌‌‌‌లో నేర్చుకున్న ట్రాఫిక్‌‌‌‌ క్లాసెస్‌‌‌‌ను స్టూడెంట్లు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌‌‌‌కి వివరిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే తలెత్తే ప్రమాదాల గురించి చెబుతూ స్కూల్ ఆవరణలో ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. సిగ్నల్స్, యూ టర్న్‌‌‌‌, జీబ్రా క్రాసింగ్‌‌‌‌, నో పార్కింగ్ ప్లేసెస్‌‌‌‌తో పాటు రాష్‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌, డ్రంకెన్ డ్రైవ్ లాంటి రూల్స్‌‌‌‌ గురించి ప్రచారం చేస్తున్నారు.
 స్టూడెంట్లను డ్రాప్ చేసేందుకు వచ్చిన తల్లిదండ్రులను ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుతున్నారు. చిన్నారులతో కలిసి డ్రైవింగ్ చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. సుమారు పది మంది స్టూడెంట్లు వివిధ ట్రాఫిక్ రూల్స్‌‌‌‌కు సంబంధించిన ప్లకార్డులతో వాహన
దారులకు అవగాహన కలిగిస్తున్నారు.

 ప్రేయర్ కు ముందే ప్లకార్డుల ప్రదర్శన

ప్రతి రోజు ఉదయం ప్రేయర్​కు ముందే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగించేలా స్కూల్ ఆవరణలో స్టూడెంట్లతో ప్లకార్డులను ప్రదర్శిస్తున్నాం. స్కూల్​కు పిల్లలను తీసుకొచ్చే తల్లిదండ్రులు, వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ ను వివరిస్తున్నాం. స్టూడెంట్లు వారి పేరెంట్స్ తో కలిసి ట్రావెల్ చేసే టైమ్ లో ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నాం. 
 – కృష్ణారెడ్డి, చైర్మన్‌‌‌‌, శ్లోకా ది స్కూల్‌‌‌‌,  బాలాపూర్  

రోడ్ సేఫ్టీపై కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నం

 ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ రూల్స్‌‌‌‌పై అవగాహన ఉండాలి. స్టూడెంట్లకు రోడ్ సేఫ్టీపై  డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన, షార్ట్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌, స్కిట్స్ లాంటి పోటీలను  నిర్వహిస్తున్నాం. వాటిల్లో ప్రతిభ చూపిన వారికి సర్టిఫికెట్లు, గిఫ్ట్ ప్రైజ్​లు అందిస్తున్నాం. స్టూడెంట్లు వారి తల్లిదండ్రులకు సైతం ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేలా ట్రైనింగ్ ఇస్తున్నాం. 
– సుధీర్ బాబు, సిటీ ట్రాఫిక్ చీఫ్