బేసి నంబర్ కారు..చలాన్ వేసిన పోలీసులు

బేసి నంబర్ కారు..చలాన్ వేసిన పోలీసులు

ఢిల్లీనీ కాలుష్యం కమ్మేస్తుంది. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ సరి బేసీ విధానం ప్రవేశపెట్టారు. అయితే ఇవాళ(సోమవారం) రిజిస్ట్రేషన్ నెంబర్ చివర్లో సరి సంఖ్య ఉన్న వాహనాలు మాత్రమే రోడ్డుపై తిరగాలి. రూల్ బ్రేక్ చేసిన వారికి రూ. 4 వేలు చలాన్ విధించనుంది. కాలుష్యం దృష్టా అందరూ సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

అయితే ఇవాళ ఐటీఓ లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఐటీఓ సమీపంలో బేసి నంబర్ వాహనం రోడ్డుపై కనిపించినందుకు ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్‌కు జరిమానా విధించారు. ఆ డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.   తాను  నోయిడాలో ఉంటున్నానని.. గత రాత్రి  కొంచెం పని కోసం వచ్చానని చెప్పాడు. సరి-బేసి విధానం ఇక్కడ  అమల్లో ఉందనే  విషయం  తనకు తెలియదని చెప్పాడు.