
హైదరాబాద్,వెలుగు: ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ ఫ్లాగ్- ఆఫ్, పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగనున్న బహిరంగ సభకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ డైవర్షన్స్ వివరాలను సిటీ సీపీ ఆనంద్ గురువారం వెల్లడించారు..శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం1.30 గంటల వరకు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రధాని సభకు జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల వెహికల్స్‌కు దోబీఘాట్, బైసన్ పోల్ గ్రౌండ్స్, ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్, కంటోన్మెంట్ పార్క్ గ్రౌండ్, నెక్లెస్ రోడ్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఇతర మార్గాల్లో ట్రావెల్ చేయాలని చెప్పారు.
ప్యాసింజర్లు రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన రూట్
చిలకలగూడ జంక్షన్ వైపు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎంట్రీకి ఆంక్షలు ఉంటాయి.
- ప్లాట్‌ఫాం నం.1 నుంచి 8 వరకు వెళ్లే ప్యాసింజర్లు ప్లాట్‌ఫాం నం. 1కి వెళ్లే ఎంట్రీ నుంచి రైల్వే స్టేషన్‌లోకి చేరుకోవాలి. సెయింట్ జాన్స్ రోటరీ- –- రెతిఫైల్ టి జంక్షన్, చిలకల గూడ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి వచ్చే వాహనదారులు క్లాక్ టవర్,- పాస్‌పోర్ట్ ఆఫీస్,- రెజిమెంటల్ బజార్ మీదుగా రావాల్సి ఉంటుంది.
- పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ : ఖైరతాబాద్ జంక్షన్ –ఐమాక్స్ రోటరీ–తెలుగు తల్లి ఫ్లై ఓవర్–లోయర్ ట్యాంక్ బండ్–ఆర్టీసీక్రాస్ రోడ్స్–ముషీరాబాద్ క్రాస్ రోడ్స్–గాంధీ హాస్పిటల్–- చిలకలగూడ క్రాస్ రోడ్స్–- సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్‌ఫాం నం.10కు చేరుకోవాలి.
- ఓల్డ్ గాంధీ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వారు -మోండా మార్కెట్ – ఘాన్సీమండి– బైబిల్‌హౌస్– కర్బలా మైదాన్– ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాలి.
- సికింద్రాబాద్ క్లాక్‌టవర్ నుంచి వెళ్లే వారు ప్యాట్నీ –- బైబిల్ హౌస్– - కర్బలా మైదాన్–- ట్యాంక్‌బండ్ మీదుగా స్టేషన్‌కు చేరుకోవాలి.
- ఉప్పల్ నుంచి నుంచి వచ్చే వారు తార్నాక, ఆలుగడ్డ బావి, చిలకలగూడ క్రాస్ రోడ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
- ఉప్పల్ నుంచి పంజాగుట్టకు వెళ్లేవారు రామంతా పూర్, అంబర్‌పేట, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ మీదుగా ట్రావెల్ చేయాలి.
ఈ రూట్లలో నో ఎంట్రీ
- టివోలి క్రాస్‌రోడ్స్ నుంచి ప్లాజా క్రాస్‌రోడ్స్
- ఎస్‌బీఐ క్రాస్‌రోడ్స్–స్వీకార్ ఉప్‌కార్ జంక్షన్
ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండే ఏరియాలు
- మోనప్ప జంక్షన్ – సీటీవోజంక్షన్– -సెయింట్ జాన్ రోటరీ– సంగీత్ క్రాస్ రోడ్– చిలకలగూడ జంక్షన్
- ఎంజీ రోడ్,ఆర్పీరోడ్, ఎస్పీ రోడ్
ట్రాఫిక్ జామ్‌కు అవకాశం ఉన్న ఏరియాలు
- మోనప్ప జంక్షన్ – గ్రీన్‌లాండ్స్– ప్రకాశ్‌నగర్–
- రసూల్‌పురా– సీటీవో– ప్లాజా– ఎస్‌బీఐ క్రాస్
- రోడ్స్ – వైఎంసీఏ– సెయింట్‌జాన్‌రోటరీ
- సంగీత్ క్రాస్ రోడ్స్– ఆలుగడ్డబావి–
- మెట్టుగూడ– చిలకలగూడ–బ్రూక్ బాండ్– టివోలి– బాలంరాయి – సికింద్రాబాద్ క్లబ్– తిరుమలగిరి– తాడ్‌బండ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి -ప్యాట్నీ , ప్యారడైజ్,- బేగంపేట, పంజాగుట్ట వైపు రద్దీగా ఉంటుంది.