లాల్ దర్వాజ బోనాలు.. ఆది, సోమవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

V6 Velugu Posted on Jul 31, 2021

 • లాల్ దర్వాజ బోనాలకు ట్రాఫిక్ ఆంక్షలు
 • ఆదివారం ఉదయం నుంచి సోమవారం రాత్రి 11 వరకు అమలు

హైదరాబాద్‌‌,వెలుగు: ఆగస్టు 1, 2 తేదీల్లో జరిగే ఓల్డ్ సిటీలోని లాల్‌‌దర్వాజ  సింహవాహిని మహంకాళి, అంబర్‌‌‌‌పేట బోనాలకు పోలీసులు బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు పూర్తి చేశారు.  సింహవాహిని ఆలయంతో పాటు  ఓల్డ్ సిటీలోని 133 దేవాలయాల వద్ద సెక్యూరిటీ పెట్టారు.  ఆదివారం బోనాలు, సింహవాహిని అమ్మవారి ఊరేగింపు నేపథ్యంలో 3,500 మంది పోలీసులతో సెక్యూరిటీ,  సుమారు 400 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సిటీ సీపీ అంజనీకుమార్ తెలిపారు. లాల్‌‌దర్వాజ, అంబర్‌‌‌‌పేటలోని మహంకాళి ఆలయాల పరిసర ప్రాంతాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ జాయింట్‌‌ సీపీ అనిల్‌‌కుమార్ శుక్రవారం నోటిఫికేషన్‌‌ విడుదల చేశారు. అలియాబాద్‌‌, శాలిబండ, ఆర్య మైదాన్, అల్క థియేటర్‌‌‌‌,‌‌లక్ష్మీనగర్‌‌‌‌ వెంకటేశ్వర టెంపుల్‌‌, సరస్వతి విద్యానికేతన్‌‌, గవర్నమెంట్‌‌ జూనియర్ కాలేజీ  వద్ద వెహికల్ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

ఆది, సోమవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

 •     ఫలక్‌‌నుమా, ఇంజన్‌‌ బౌలి నుంచి వచ్చే వెహికల్స్​ అలియాబాద్‌‌ నుంచి షంషీర్‌‌ గంజ్‌‌, గోశాల ,తాడ్‌‌బన్‌‌ మీదుగా వెళ్లాలి.
 •     కందికల్‌‌ గేట్‌‌, బాలరాజ్‌‌ గంజ్‌‌ నుంచి లాల్‌‌ దర్వాజ రూట్‌‌లో ట్రాఫిక్​ను  అనుమతించరు. ఓల్డ్‌‌ ఛత్రినాక మీదుగా గౌలిపురా వైపు మళ్లిస్తారు.
 •     ఉప్పుగూడ నుంచి ఛత్రినాక వైపు నుంచి వచ్చే వెహికల్స్ ను గౌలిపురా క్రాస్‌‌ రోడ్స్‌‌ నుంచి మొగల్‌‌పురా పీఎస్‌‌ వైపు మళ్లిస్తారు.
 •     మీర్‌‌‌‌కా దయార,మొఘల్‌‌పురా నుంచి హరిబౌలి క్రాస్​కు వచ్చే  ట్రాఫిక్​ను వాటర్‌‌ ట్యాంక్ ఏరియా మీదుగా డైవర్ట్ చేస్తారు.
 •     చార్మినార్‌‌‌‌ మెయిన్‌‌ రోడ్‌‌, అస్రా హాస్పిటల్‌‌ నుంచి వచ్చే ట్రాఫిక్​ను మొఘల్‌‌పురా వాటర్ ట్యాంక్‌‌ మీదుగా బీబీ బజార్‌‌‌‌ వైపు మళ్లిస్తారు.
 •     లాల్‌‌దర్వాజ టెంపుల్‌‌, ఊరేగింపు జరిగే 19 ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి.
 •     చార్మినార్‌‌‌‌, ఫలక్‌‌నుమా, నయాపూల్‌‌ నుంచి ఓల్డ్‌‌ సీబీఎస్‌‌, అఫ్జల్‌‌గంజ్‌‌, దారుసలాం క్రాస్‌‌ రోడ్స్, ఇంజన్‌‌బౌలి  మీదుగా ఆర్టీసీ బస్సులను 
 •     అనుమతించరు. 

ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు ..

 • ఉప్పల్‌‌ నుంచి అంబర్‌‌‌‌ పేట్‌‌ మీదుగా ట్రావెల్‌‌ చేసే  సిటీ బస్సులను హబ్సిగూడ,తార్నాక, అడిక్‌‌మెట్‌‌,విద్యానగర్‌‌‌‌, ఫీవర్ హాస్పిటల్‌‌, నింబోలి అడ్డా, చాదర్‌‌‌‌ఘాట్‌‌ మీదుగా సీబీఎస్‌‌ వైపు మళ్లిస్తారు.
 • ఉప్పల్‌‌ నుంచి అంబర్‌‌‌‌పేట్‌‌ వైపు వచ్చే సిటీ బస్సులను గాంధీ విగ్రహం వద్ద సీపీఎల్‌‌,సల్దానా గేట్‌‌, టి– జంక్షన్‌‌, రోడ్‌‌ నం.6, అలీకేఫ్‌‌ మీదుగా 
 • మళ్లిస్తారు.
 • నింబోలి అడ్డా మీదుగా దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌, శివం రోడ్‌‌ ‌‌ నుంచి అంబర్‌‌‌‌పేట వైపు వచ్చే బస్సులను అలీకేఫ్‌‌, జిందా తిలిస్మాత్‌‌ రోడ్‌‌, తిలక్‌‌నగర్‌‌‌‌ మీదుగా మళ్లిస్తారు.
 • నింబోలి అడ్డా నుంచి అంబర్‌‌‌‌పేట్‌‌ వైపు వచ్చే బస్సులను టూరిస్ట్ హోటల్‌‌, ఫీవర్ హాస్పిటల్, ఓయూ ఫ్లై ఓవర్, తార్నాక మీదుగా మళ్లిస్తారు.  

Tagged Hyderabad, Lal Darwaza Bonalu, trafficjam, road diversion, traffic restirictions

Latest Videos

Subscribe Now

More News