అంతిమయాత్రలో విషాదం..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పటాకులు పేలి నలుగురికి గాయాలు..

అంతిమయాత్రలో విషాదం..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పటాకులు పేలి నలుగురికి గాయాలు..

టేకులపల్లి, వెలుగు: మహిళ అంతిమ యాత్రలో పటాకులు పేలి నలుగురు గాయపడిన ఘటన బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకట్యతండాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని ఓ మహిళ అంతిమ యాత్ర కోసం పటాకులను డీఏ ట్రాలీ క్యాబిన్​లో ఉంచగా, ముందుగా కాల్చిన పటాకుల నిప్పురవ్వలు క్యాబిన్​లో పడటంతో మంటలు చెలరేగాయి. 

ఈ ఘటనలో భూక్య రాణా ప్రతాప్, ఆంగోతు ధ్రువంత్, ధరావత్ రవితేజ, నవీన్ గాయపడ్డారు. వీరిని టేకులపల్లి రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, రాణాప్రతాప్, ధ్రువంత్​ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కె.తిరుపతి ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.