సూర్యాపేట జిల్లాలో విషాదం.. ప్రాణం తీసుకున్న ఏఎస్సై.. గేటెడ్ కమ్యూనిటీలోని ఇంట్లో..

సూర్యాపేట జిల్లాలో విషాదం.. ప్రాణం తీసుకున్న ఏఎస్సై.. గేటెడ్ కమ్యూనిటీలోని ఇంట్లో..

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లాలోని నాగారం పీఎస్లో SB  ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోపగాని సత్యనారాయణ గౌడ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. సూర్యాపేట పట్టణములోని ఓ గేటేడ్ కమ్యూనిటీలోని తన ఇంట్లో ఏఎస్సై సత్యనారాయణ గౌడ్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ ఇబ్బందులే కారణమని ప్రాధమిక సమాచారం. ఈ ఘటనపై రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్సై సత్యనారాయణ గౌడ్ సూర్యాపేట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ సోదరుడు కావడం గమనార్హం.

కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్‌‌‌‌ ఖమ్మం జిల్లాలో కూడా ఆగస్ట్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ములుగు జిల్లాకు చెందిన అల్లం బాలరాజు (40) సత్తుపల్లి 15వ బెటాలియన్‌‌‌‌లో కానిస్టేబుల్‌‌‌‌గా పనిచేస్తూ బేతుపల్లి గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. భార్యతో గొడవలు జరగడంతో ఏడాది కింద ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాలరాజు ఒక్కడే ఉంటున్నాడు.

►ALSO READ | లోకల్ కాక.. పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లొచ్చన్న ఈసీ.. 16న రాష్ట్ర కేబినెట్ భేటీ

అతడు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్‌‌‌‌ బెటాలియన్‌‌‌‌ అధికారులకు, పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు.