మియాపూర్, వెలుగు: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కంటి చూపు, వినికిడి లోపం, మానసిక సమస్యలతో బాధపడుతున్న విజయ్ బాబు (24) మంగళవారం మధ్యాహ్నం నాలుగో అంతస్తులో లిఫ్ట్ డోర్ తెరిచాడు.
లిఫ్ట్ మొదటి అంతస్తులో ఉండటాన్ని గమనించక కాలు వేయడంతో కింద ఉన్న లిఫ్ట్‌పై పడిపోయాడు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి వెంకటేశ్ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
