ఎల్లమ్మగూడెం సర్పంచ్ సంచలన ఆరోపణలు

ఎల్లమ్మగూడెం సర్పంచ్ సంచలన ఆరోపణలు

తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ సంధ్యారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త హత్య వెనుక నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని చెప్పినా ఎస్పీకి పట్టించుకోలేదని, పోలీసుల నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలల క్రితం హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ వెళ్లగా... అక్కడ కూడా తమపై దాడి  జరిగిందని సంధ్యారెడ్డి చెప్పారు.

గతంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద హతమార్చాలని పథకం వేశారని.. గ్రామస్తులు ఉండడంతో వెనక్కి వెళ్లారని సంధ్యారెడ్డి వెల్లడించారు. ఈ విషయంపై తిప్పర్తి పీఎస్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. రాజకీయ నాయకుల అండదండలతోనే తన భర్తను హత్య చేశారని ఆమె తెలిపారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు సందీప్ రెడ్డి, సునంద్ రెడ్డిలు కలిసి తన భర్తను హత్య చేశారని సంధ్యారెడ్డి ఆరోపించారు.