బోరుమన్న బీసీ కాలనీ .. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

బోరుమన్న బీసీ కాలనీ .. ఒకే కుటుంబంలో  నలుగురు మృతి
  • డెడ్ బాడీలు గద్వాలలోని బీసీ కాలనీకి.. ఒకే సారి నలుగురికి అంత్యక్రియలు పూర్తి 

గద్వాల, వెలుగు:  కర్ణాటకలోని విజయపురి జిల్లా మనగులి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్, పవిత్ర, అభిరామ్, జ్యోత్స్న డెడ్ బాడీలను కుటుంబ సభ్యులు గురువారం గద్వాలలోని బీసీ కాలనీకి తీసుకువచ్చారు.   డెడ్ బాడీలను చూసి ప్రతి ఒక్కరూ బోరున విలపించారు.  ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తల్లి హుస్సేనమ్మ, తమ్ముళ్లు వెంకటేశ్ ప్రశాంత్ లు విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. 

నలుగురికి ఒకేసారి కాలనీ సమీపంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. గాయపడ్డ మరో బాలుడు ఇంకా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్టు బంధువులు తెలిపారు. మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత, మోహన్ రెడ్డి, సుభాన్, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రజక జయశ్రీ, రజక నరసింహులు,బీఆర్ ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పలువురు ఆర్థిక సాయం కూడా అందించారు.