పట్టాలు తప్పిన పెట్రోల్ రైలు.. మరో ట్రాక్ పై పడిన బోగీలు.. తప్పిన అతి భారీ ప్రమాదం

పట్టాలు తప్పిన పెట్రోల్ రైలు.. మరో ట్రాక్ పై పడిన బోగీలు.. తప్పిన అతి భారీ ప్రమాదం

దేశంలో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒడిశాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో వందల మంది చనిపోయి..వేల మంది గాయపడగా....తాజాగా మధ్యప్రదేశ్ లో మరో రైలు ప్రమాదానికి గురైంది. ఎల్పీజీ గ్యాస్ తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వెంటనే గమనించిన లోకో పైలెట్ రైలును ఆపేడంతో పెను ప్రమాదం తప్పింది. 

Also Read ట్రాక్ట‌ర్ ను ఢీకొన్న బొకారో ఎక్స్ ప్రెస్.. జార్ఖండ్ లో రైలు ప్ర‌మాదం

 మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబల్‌పూర్ జిల్లాలోని భారత్ పెట్రోలియంకు చెందిన ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్లను ఖాళీ చేయడానికి వెళుతున్న గూడ్స్ రైలు నుంచి రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. జబల్ పూర్ జిల్లాలోని షాపురా భిటోని స్టేషన్‌లోని భారత్ పెట్రోలియం డిపో సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు మంగళవారం జూన్ 6వ తేదీ అర్థరాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తున్నారు.