రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు..తప్పిన ఘోర రైలు ప్రమాదం

రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు..తప్పిన ఘోర రైలు ప్రమాదం


రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు.. అది కూడా సిలిండర్లలో ఫుల్ గ్యాస్.. ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలిండర్లను రైలు పట్టాలపై పెట్టారు దుర్మార్గులు.. ఈ గ్యాస్ సిలిండర్లను ముందుగానే గుర్తించిన రైలు డ్రైవర్.. వేగం తగ్గించటంతో ఘోర రైలు ప్రమాదం తప్పింది.. షాకింగ్ గా ఉన్న ఈ ఇన్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ నుంచి కాళింది ఎక్స్‌ప్రెస్ హర్యానాలోని భివానీకి వెళ్తుండగా.. కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్ ప్రాంతం దగ్గర పట్టాలపై ఏదో అనుమానస్పద వస్తువులు ఉన్నట్లు  లోకోమోటివ్ పైలట్ గుర్తించి వెంటనే  బ్రేక్‌లు వేశాడు.  అయితే రైలు ఆగిపోయే లోపై సిలిండర్‌ను ఢీకొట్టింది.దాదాపు 50 మీటర్ల  దూరంలో ఎగిరిపడింది. కానీ ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు.

Also Read:-డాక్టర్ల ధర్నా వల్ల 23 మంది రోగులు చనిపోయారు..!

ఘటనా స్థలానికి వచ్చిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ,పోలీసులు పాడైన సిలిండర్‌ తో పాటు ఓ పెట్రోలో బాటిల్, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో దాదాపు రైలు 20 నిముషాలు ఆగిపోయింది. కేసు నమోదు చేసిన కాన్పూర్ పోలీసులు విచారణకు  ఐదు బృందాలను కూడా ఏర్పాటు చేశారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము.