తెలంగాణ నుంచి వలస కూలీల తరలింపు

తెలంగాణ నుంచి వలస కూలీల తరలింపు
  • లింగంపల్లి నుంచి జార్ఖండ్‌కు స్పెషల్‌ ట్రైన్‌

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణం ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, స్టూడెంట్స్‌, టూరిస్టులను తమ సొంత రాష్ట్రాలకు తరలించాలని కేంద్ర ఆదేశించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి. ఈ మేరకు తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు ఫస్ట్‌ ట్రైన్‌ ప్రారంభమైంది. 24 కంపార్ట్‌మెంట్లలో దాదాపు 1100 మంది కూలీలతో లింగంపల్లి నుంచి జార్ఖండ్‌కుశుక్రవారం తెల్లవారుజామున స్పెషల్‌ ట్రైన్‌ బయలుదేరినట్లు అధికారులు చెప్పారు. రాత్రి 11 గంటలకు రైలు జార్ఖండ్‌ చేరుకుంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఐఐటీ హైదరాబాద్‌ దగ్గర చిక్కుకున్న వారిని తరలించారు. వలస కూలీలను తమ రాష్ట్రాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలే ప్రత్యేక బస్సులు పెట్టాలని ఆదేశించినప్పటికీ.. కొన్ని ప్రదేశాలు చాలా దూరంగా ఉన్న కారణంగా రైళ్లు నడిపేందుకు అవకాశం ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రాన్ని కోరాయి.