బార్డర్ లో డేగ కాళ్లకు ఉంగరం కట్టి ఎగరేశారు.. పట్టుకున్న బీఎస్ఎఫ్

బార్డర్ లో డేగ కాళ్లకు ఉంగరం కట్టి ఎగరేశారు.. పట్టుకున్న బీఎస్ఎఫ్

రాజస్థాన్ లోని జైసల్మేర్ లో భారత్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని షాఘర్ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళ సిబ్బంది వేటాడే డేగను పట్టుకున్నారు. అధికారులు ఈ డేగను పెంపుడు జంతువుగా భావిస్తున్నారు. అయితే, ఈ పక్షి నుండి ట్రాన్స్‌మిటర్ లాంటి ఎటువంటి పరికరాలను అధికారులు కనుగొనలేదు. కానీ దాని కాలికి ఓ ఉంగరం ఉండడం మాత్రం గమనించారు. విచారణ అనంతరం ఈ వేటాడే డేగను అటవీ శాఖకు అప్పగించారు. ఆ వెంటనే అది మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది.
 
పలు నివేదికల ప్రకారం, భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో డిసెంబర్ 27న సాయంత్రం ఈ వేటాడే పాకిస్థానీ పెరెగ్రైన్ ఫాల్కన్ పట్టుబడింది. ఈ పక్షి సరిహద్దు దాటి ఎగిరింది. అయితే, డేగపై ఏ రకమైన ట్రాన్స్‌మిటర్ లేదు. అది ఒకవేళ విమానంలో ఎక్కడో ఒకచోట పడిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కానీ దాని కాలికి ఉన్న ఉంగరంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో జైసల్మేర్‌ సరిహద్దుల్లో ఉన్న అరబ్‌ రాజకుటుంబ సభ్యులకు చెందిన ఈ డేగ ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.