తేనెటీగల పెంపకంపై అగ్రి వర్సిటీలో శిక్షణ

తేనెటీగల పెంపకంపై అగ్రి వర్సిటీలో శిక్షణ

గండిపేట, వెలుగు: నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్(ఎన్ బీ హెచ్ఎం)లో భాగంగా రాజేంద్రనగర్​లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి వర్సిటీలో రైతులు, యువతకు తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటరమణ చీఫ్ గెస్టుగా హాజరై వ్యవసాయంలో తేనెటీగల పాత్ర, వాటి సంరక్షణ గురించి వివరించారు.

రైతులు వ్యాపార దృక్పథంతో తేనెటీగల పెంపకాన్ని చేపడితే మంచి లాభాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రెహమాన్, సైంటిస్ట్ రవీందర్ రెడ్డి, డాక్టర్ సమీర్ కుమార్, సీనియర్ ప్రొఫెసర్ సునీత, వివిధ జిల్లాలకు చెందిన 25 మంది రైతులు, యువత పాల్గొన్నారు.