సికింద్రాబాద్, వెలుగు: ట్రాఫిక్బ్లాక్కారణంగా వివిధ స్టేషన్ల మధ్య నడిచే పలు రైళ్లను ఈ నెల 12 నుంచి 22 వరకు దారి మళ్లించినట్లు, మరికొన్నింటిని రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం తెలిపింది. 12, 15, 16, 19 తేదీల్లో కాచిగూడ, మహబూబ్నగర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్రైళ్లు షాద్నగర్ వెళ్లవు. వాటిని దారి మళ్లిస్తున్నారు. 20న హౌరా-– శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య నడిచే సూపర్ఫాస్ట్ఎక్స్ప్రెస్ను నంద్యాల, ఎర్రగుంట్ల మీదుగా దారి మళ్లిస్తున్నారు. డోన్, గుత్తి స్టేషన్ల స్టాప్లను రద్దు చేశారు. 22న శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం-– హౌరా, పూరి-– యశ్వంత్పూర్మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లను గుత్తి ఫోర్ట్, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా మళ్లిస్తున్నారు. డోన్, గుత్తి స్టేషన్ల స్టాప్లను రద్దు చేశారు.
