
ఎల్బీనగర్, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సుధీర్ బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వనస్థలిపురం ఇన్స్పెక్టర్గా బి. రవికుమార్, ఉప్పల్ ఇన్ స్పెక్టర్‌గా ఎన్. ఎలక్షన్ రెడ్డి, పోచారం ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్గా బి. రాజు, చర్లపల్లి ఇన్స్పెక్టర్గా వై. రవీందర్, నాచారం ఇన్ స్పెక్టర్‌గా ఎన్. నందీశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి ఇన్స్పెక్టర్గా బి. సత్యనారాయణ, మేడిపల్లి ఇన్స్పెక్టర్గా ఆర్. గోవింద రెడ్డి, మీర్ పేట ఇన్స్పెక్టర్గా ఎం. కాశీ విశ్వనాథ్, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్గా పి. ఆంజనేయులును బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా ఐదుగురిని ఎస్వోటీ, సైబర్ క్రైమ్, స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.