ఏపీలో ఐఏఎస్‌,ఐపీఎస్ అధికారుల బదిలీ

 ఏపీలో ఐఏఎస్‌,ఐపీఎస్ అధికారుల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొందరికి జోడు పదవుల్లోనూ కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డిని టీటీడీ ఈవోగానూ కొనసాగుతారు. అలాగే అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్ ప్రసాద్‌, సీసీఎల్‌ఏగా జి.సాయిప్రసాద్‌, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జి.ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌.విజయ్‌కుమార్‌ ను నియమించారు. అలాగే రవాణాశాఖ కమిషనర్‌గా ఎం.టి.కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌కుమార్‌, క్రీడలు, యువజనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్‌ భార్గవకు అదనపు బాధ్యతలు, ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా ఎ.బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. 
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీబీ డీజీగా బదిలీ
తాత్కాలిక డీజీపీగా నియమితులైన రాజేంద్రనాథరెడ్డిని ఏసీబీ డీజీగా బదిలీ చేసింది ప్రభుత్వం. ఏపీ డీజీపీ పూర్తి అదనపు బాధ్యతల్లోనూ ఆయన కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఐపీఎస్‌ అధికారి పి.సీతారామాంజనేయులుకు ఏపీపీఎస్‌సీ కార్యదర్శి నుంచి రిలీవ్‌ చేయాలని ఆదేశిస్తూ.. ఆయనను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ ఏడీజీగా శంకబ్రతబాగ్చిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం  ఏపీఎస్పీ బెటాలియన్స్ ఏడీజీగానూ ఆయను పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. 

 

ఇవి కూడా చదవండి

రైల్వేల ప్రైవేటీకరణపై వరుణ్ గాంధీ ఆసక్తికర కామెంట్స్

రాష్ట్ర  ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించాలి

ప్రజల కష్టార్జితాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెడుతుండు

మధ్యప్రదేశ్లో ‘తెలుగు వెలుగు’