డమ్మీ కంపెనీల పేరుతో చైనాకు తరలిస్తున్నరు

డమ్మీ కంపెనీల పేరుతో చైనాకు తరలిస్తున్నరు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: క్రిప్టో కరెన్సీ ఎక్స్​చేంజ్‌‌‌‌‌‌‌‌ పేరుతో చైనాకు జరుగుతున్న మనీ లాండరింగ్‌‌‌‌‌‌‌‌ గుట్టురట్టైంది. బెంగళూరు కేంద్రంగా డమ్మీ కంపెనీలు ఏర్పాటు చేసిన ఫ్లిప్‌‌‌‌‌‌‌‌వోల్ట్‌‌‌‌‌‌‌‌, ఎల్లో ట్యూన్ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌కు చెందిన రూ.370 కోట్లను ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌(ఈడీ) అధికారులు శుక్రవారం ఫ్రీజ్ చేశారు. వివిధ యాప్​ల రూపంలో క్రిప్టో కరెన్సీ డైవర్ట్‌‌‌‌‌‌‌‌ అవుతున్నట్లు గుర్తించామని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ అధికారులు తెలిపారు.

ఎల్లో ట్యూన్ టెక్నాలజీస్ సహా మొత్తం 23 షెల్‌‌‌‌‌‌‌‌ కంపెనీల పేరుతో అక్రమాలు జరిగినట్లు వెల్లడించారు. చైనా సిటిజన్లయిన అలెక్స్, కైడి స్థానిక సీఏల సాయంతో డమ్మీ పేర్లతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారని, 2020 నుంచి ఇంటర్నెట్, డిజిటల్ సైన్ ద్వారా చైనాకు క్రిప్టో కరెన్సీ రూపంటో కోట్లలో డబ్బు తరలించారని గుర్తించినట్లు ఈడీ జరిగినట్లు ఈడీ అధికారులు తెలిపారు.