13 జిల్లాల స్పౌస్ టీచర్స్ బదిలీలు పెండింగ్ లో ఉంచిన్రు

13 జిల్లాల  స్పౌస్ టీచర్స్ బదిలీలు పెండింగ్ లో ఉంచిన్రు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బ్లాక్ చేయబడిన13  జిల్లాల భార్య భర్తల బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయుల కుటుంబాలు డిమాండ్ చేశాయి. టెలిఫోన్ భవన్ డీఎస్ఈ ( డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్) కార్యాలయం ముట్టడికి యత్నించిన స్పౌస్ టీచర్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు రోడ్డుపై బైటాయించి ఉపాధ్యాయ భార్య భర్తలు, పిల్లలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 317 జీవో ప్రకారం భార్యాభర్త ఉపాధ్యాయులకు ఒకే జిల్లాలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. భర్త ఒక జిల్లాలో, భార్య ఒక జిల్లాలో పని చేస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మా పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుందన్న ఉపాధ్యాయులు... ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ బదిలీ చేపడతామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 19 జిల్లాల స్పౌస్ టీచర్స్ బదిలీ చేశారని, 13 జిల్లాల  స్పౌస్ టీచర్స్ బదిలీలు మాత్రం 8 నెలలు పెండింగ్ లో ఉంచారని ఆరోపించారు. భార్యా భర్తల ఉపాధ్యాయులను ఒకే జిల్లాలకు బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు.