గొప్ప మనసు చాటుకున్న విజయ్.. కన్నీళ్లు పెట్టుకున్న ట్రాన్స్జెండర్

గొప్ప మనసు చాటుకున్న విజయ్.. కన్నీళ్లు పెట్టుకున్న ట్రాన్స్జెండర్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇటీవల ఖుషీ(Kushi) సినిమా రిలీజ్ సమయంలో వంద మందికి కోటీ రూపాయలు పంచిన విషయం తెలిసిందే. దాంతో ప్రేక్షకులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఆలాంటి పనిచేసి వార్తల్లో నిలిచాడు విజయ్ దేవరకొండ. విజయ్ తన చేసిన సహాయాన్ని తల్చుకుంటూ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు ఓ ట్రాన్స్జెండర్ ప్రస్తుతం ఈ వీడేమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

  
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కరోనా సమయంలో విజయ్ దేవరకొండ ఫౌండేషన్ పేరిట ఎంతో మంది పేద కుటుంబాలకు సరుకులు పంపించాడు. ఆ సంయమలో విజయ్ దేవరకొండ నుండి సహాయమా పొందిన ఓ ట్రాన్స్‌జెండర్ తన పరిస్థితి గురించి, విజయ్ తనకు అందించిన సహాయం గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న తాను విజయ్ గురించి మాట్లాడుతూ.. కరోనా లాక్‌డౌన్ సమయంలో మా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తినడానికి తిండి లేక, రూం రెంట్స్ కట్టడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటి కష్ట కాలంలో మాకు విజయ్ దేవరకొండ ఫౌండేషన్ గురించి తెలిసింది. వారికీ మా గురించి, మా పరిస్థితి గురించి వివరించగానే.. వెంటనే రియాక్ట్ అయ్యారు. సరుకులు కొనుక్కునేందుకు ఆన్లైన్ లో డబ్బులు పంపారు. ఆ రోజు విజయ్ దేవరకొండ నుండి మేము పొందిన సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. నాకు మాత్రమే కాదు.. నాలాంటి చాలా మంది ట్రాన్స్‌జెండర్లకు సహాయం అందించారు విజయ్ దేవరకొండ.. అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ఇక విజయ్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన పరశురామ్(Parasuram) దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్(Family star) అనే సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్ గా నటిస్తున్నారు. గోపీ సుందర్(Gopi sundar) సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.