జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వెంకట్‌రావుపల్లి సర్పంచ్ క్యాండిడేట్‌గా ట్రాన్స్‌జండర్ కుమ్మరి వైశాలి నామినేషన్ వేశారు. వెంకట్రావుపల్లి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో.. వైశాలి తన నామినేషన్ పేపర్లను గురువారం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెంకట్రావుపల్లి గ్రామ ప్రజలు తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
