
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ విమానాశ్రయం నుంచి గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి లైవ్ ఆర్గాన్స్‌ను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్‌లోని సెవెన్ హిల్స్ ఆస్పత్రి నుంచి ఇండిగో విమానంలో రాత్రి 7.15 నిమిషాలకు శంషాబాద్‌కు ఆర్గాన్స్ (లంగ్స్) చేరుకున్నాయి.
వీటిని గ్రీన్‌చానల్ ద్వారా అంబులెన్స్‌లో 8.15 నిమిషాలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు శంషాబాద్ ఆర్జీఏ ట్రాఫిక్ సీఐ రాజు తెలిపారు.