చెత్త తరలించే కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వండి

చెత్త తరలించే కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వండి

టిప్పర్, ఆటో, రిక్షా కార్మికుల జేఏసీ డిమాండ్

ఖైరతాబాద్, వెలుగు: టీఎస్‌‌ స్వచ్ఛ ఆటో, టిప్పర్, రిక్షా కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆ కార్మికుల జేఏసీ చైర్మన్ సూరన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్‌‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి తరలించేందుకు రాష్ట్ర సర్కారు 2015లో టిప్పర్లు కేటాయించిందన్నారు. చెత్త తరలించే కార్మికులుగా పనిచేస్తున్న వారికి హెల్త్​కార్డులు ఇవ్వాలని కోరారు.  స్వచ్ఛ ఆటో, టిప్పర్​ రిపేర్లకు నెలకు రూ.20 వేలు అవుతుందని, పాడైన వెహికల్స్ స్థానంలో కొత్తవి ఇవ్వాలన్నారు. సమావేశంలో  వీరేశ్‌‌, గోపి,​ నర్సింగ్‌‌ తదితరులు పాల్గొన్నారు.