బస్సుల్లో ఫిట్ నెస్ తనిఖీలు చేపడితే వేధింపులంటున్నారు : పొన్నం ప్రభాకర్

బస్సుల్లో ఫిట్ నెస్ తనిఖీలు చేపడితే వేధింపులంటున్నారు : పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: ప్రతి రోజూ రవాణాశాఖ అధికారులు బస్సుల్లో ఫిట్ నెస్ తనిఖీలు చేపడితే వేధింపులని అంటున్నారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తనిఖీలు చేయక పోతే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు మండలంలో వోల్వో బస్సు ప్రమాదం దుర దృష్టకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. 

ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ..'కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన దురదృష్టక రం.. చాలా బాధ కలుగుతుంది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా, బస్సు ప్రమా దంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. త్వరలో  ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తాం. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారి స్తుంది. ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం.' అని చెప్పారు.

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్రేషియా

ఏపీలోని కర్నూల్ శివారులో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రేవంత్ సర్కార్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున 5 లక్షలు, గాయపడిన క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించింది. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.