సీఎం వద్దన్నారనే టికెట్ రేట్లు పెంచలే: రవాణా మంత్రి అజయ్

సీఎం వద్దన్నారనే టికెట్ రేట్లు పెంచలే: రవాణా మంత్రి అజయ్

లాసైనా.. ప్రజల కోసమే బస్సులు నడిపిస్తున్నం

సెప్టెంబర్ 18న అసెంబ్లీ చర్చలోనే చెప్ పిన రవాణా మంత్రి
మొత్తం బస్సుల్లో 36 శాతం పల్లెవెలుగు, 37 శాతం సిటీ
రెండు కలిపి 73 శాతం బస్సుల మీద ఆర్టీసీకి నష్టా లే
డీజిల్ రేట్ల వల్లే ఎక్కువ భారం.. అయినా ఓఆర్ పెరిగింది
ఆర్టీసీ పైనే తెలంగాణ ప్రజల నమ్మకం అని చెప్పిన పువ్వాడ

 

ఆర్టీసీ నష్టాలకు కారణం కార్మి కులే అంటూ సీఎం కేసీఆర్ వారిపైనే నెట్టేశారు. అయితే సంస్థ కష్టాలకు అసలు కారణం ఏంటి? ఐదేం డ్లలో
అసలు మెరుగుపడలేదా? అన్న ప్రశ్నలకు రవాణా మంత్రి పువ్వా డ అజయ్ సెప్టెం బర్ 18న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చ సమయంలోనే వివరంగా చెప్పారు . ఆర్టీసీ సమ్మె నేపథ్యం లో సీఎం చేస్తు న్న వాదనకు భిన్నం గా మంత్రి చాలా వివరాలను సభ ముం దు ఉంచారు. ఆ వివరాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి . మంత్రి అజయ్ చెప్పి న వివరాలు ఆయన మాటల్లోనే…

డీజిల్ రూ.20 పెరిగినా మేం పెం చలే
‘‘రవాణా శాఖకు సంబంధిం చి ప్రధానమైన సంస్థ టీఎస్ఆర్టీసీ. ఈ సంస్థ 97 డిపోలతోని, 11 రీజియన్లతో నడుస్తోం ది. సంస్థలో దాదాపు 10,489
బస్సులు ఉన్నాయి అధ్యక్షా. రోజూ 97 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థా నాలకు చేరవేస్తోంది. ఇందులో 33 లక్షల మంది ప్రయాణికులు
కేవలం హైదరాబాద్ సిటీలోనే ప్రయాణం చేస్తున్నారు. అలాగే పల్లెవెలుగు ద్వా రా దాదాపు 36 శాతం బస్సులను గ్రామీణ ప్రాంతాలకు అతి తక్కువ
చార్జీలతోనే నడుపుతోం ది. అట్లనే 37 శాతం సర్వీసులను సిటీలో నడుపుతోం ది. అంటే దాదాపు 73శాతం బస్సులు గ్రామాల్లో, సిటీలో కొం త లాసెస్ తోని, ప్రజల కోణంలో నడవబడుతున్నాయని మీ ద్వా రా తెలియజేస్తు న్నాను . అలాగే లక్షలాదిమంది విద్యార్థినీవిద్యార్థులు, స్కూలుకెళ్లే ఆడపిల్లలకైతేదాదాపు 100 శాతం రాయితీతోని, మగపిల్లలకి 90 శాతం రాయితీతోని రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. ఇది కాకుండా జర్నలిస్టులకు, అనేక ఇతర వర్గాలకు కూడా బస్ పాస్ రాయితీలను ప్రభుత్వం ఇస్తూ ఆర్సీటీ కి దాన్ని రీయింబర్స్ చేస్తోం ది. ఆర్-టీ
సీకి సంవత్సరానికి ఆదాయం 4882.7 కోట్లు వస్తోంది. రోజూ 11 కోట్ల రూపాయలు టికెట్ల ద్వా రా ఆదాయం వస్తోం ది. అట్లనే బస్ పాస్ లు,
ఇతర ఆదాయాల ద్వా రా రోజుకు 2.37 కోట్లు కలిపి మొత్తం 13.27 కోట్లు రూపాయలు సంస్థకు ఆదాయం వస్తోం ది. ఖర్చు చూస్తే 15.92 కోట్ల
రూపాయలు రోజూ ఖర్చు జరుగుతోం ది. అంటే రోజుకు 2.55 కోట్లు నష్టం వస్తోంది.

ప్రధానంగా డీజిల్ రేట్లు పెరగడం. నాలుగు సంవత్సరాల కిం ద 2016లో మనం చాలా మీగర్ పర్సం టేజ్ లో ఓన్లీ 8 శాతం టికెట్ ఫేర్స్ పెంచాం . ఆ తర్వా త నుండి ఇప్పటివరకు టికెట్ ఫేర్స్ పెం చలేదు. ప్రభుత్వం, ముఖ్యమంత్రిగారు ఫేర్స్ పెం చడానికి సుముఖంగా ఉండలేదు ఆరోజున కాబట్టి టికెట్ ఫేర్స్ కూడా పెం చలేకపోయాం . అలాగే డీజిల్ రేటు ఆరోజున 49 రూపాయలు ఉన్నది ఈరోజు 69 రూపాయలకు చేరుకోవడం వల్ల రమారమి 20 రూపాయలు ప్రతి లీటర్ మీద డీజిల్ భారం ఉంది అధ్యక్షా. అందువల్ల కూడా కొం త ఈ లాసెస్ అనేవి అక్రూ అవడం జరిగిం ది. అయినా ఒక ప్రధాన విషయం అర్థం చేసుకోవాల్సిం ది, ఇంత ప్రతికూల వాతావరణంలో కూడా ఆక్యుపెన్సీ రేషియో 69.66 శాతం నుండి 73.12 శాతానికి ఈ సంవత్సరం పెం చుకోవడం జరిగిం ది. దాని ద్వా రా సంస్థకు అదనంగా 184 కోట్లు టికెట్ మీద ఆదాయం పెరిగిం ది. సంస్థ కొత్తగా టికెటేతర ఆదాయం పెం చుకోవడానికి హైస్పీ డ్ డీజిల్ అవుట్ లెట్లు , ఖాళీ స్థలాల్లో బీవోటీ కిం ద లీజులివ్వడం లాం టివి చేపట్టడం జరిగిం ది. ఇవే కాకుండా 21 బస్టాం డ్లలో మినీ థియే టర్లు  పెట్టడా నికి ప్రణాళికలు రూపొందించాం . సంస్థ ఇంధన పొదుపులోగానీ, వెహికల్ ప్రొడక్టివిటీలో-
గానీ, సేఫ్టీ విషయంలోగానీ టీఎస్ఆర్టీసీకి గతంలో అనేక జాతీయ అవార్డులు వచ్చాయి . ఇప్పటికీ సురక్షిత ప్రయాణం, సుఖవంతమైన ప్రయాణం ఆర్టీసీ ద్వా రానే అన్నది మన తెలంగాణ ప్రజలకు బలమైన నమ్మకం ఉంది.’’

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి