
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ట్రావెల్ బుకింగ్స్‌పై ఆఫర్లు ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల బుకింగ్స్‌పై రూ.5,000 వరకు తగ్గింపు, డొమెస్టిక్ విమానాలపై 10 శాతం వరకు తగ్గింపు ఇస్తామని తెలిపింది. అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో డబ్బు చెల్లిస్తే 5శాతం క్యాష్ బాక్ పొందవచ్చు. హోటల్ బుకింగ్స్‌పై 30శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ప్రైమ్ మెంబర్స్ ఉబర్ రైడ్స్ పై 5శాతం వరకు క్యాష్ బాక్ ను దక్కించుకోవచ్చు. ఇదిలా ఉంటే, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చే నెల రెండో తేదీన మొదలవనుంది. మొబైల్ ఫోన్స్, యాక్సెసరీస్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్లు ఉంటాయి. కొన్ని కార్డులతో కొంటే అదనంగా డిస్కౌంట్లు ఇస్తారు.