Cricket World Cup 2023: తొలి మ్యాచ్‌లోనే రోహిత్ రికార్డ్ బ్రేక్.. ఆస్ట్రేలియా ఓపెనర్ అరుదైన ఘనత

Cricket World Cup 2023: తొలి మ్యాచ్‌లోనే రోహిత్ రికార్డ్ బ్రేక్.. ఆస్ట్రేలియా ఓపెనర్ అరుదైన ఘనత

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. బహుశా ఒక ఆటగాడికి ఇంతకు మించిన డెబ్యూ ఉండదనే చెప్పాలి. గాయం కారణంగా మొదటి ఐదు మ్యాచులకు దూరంగా ఉన్న ఈ ఆసీస్ ఓపెనర్ నేడు జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్ లో బరిలోకి దిగాడు. కొంచెం కూడా ఒత్తిడి లేకుండా కివీస్ బౌలర్లను ఉతికి ఆరేసాడు. ఈ క్రమంలో వరల్డ్ కప్ ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన హెడ్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్ చేసాడు. 

ఈ మ్యాచ్ లో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకున్న హెడ్ 100 పరుగుల మార్క్ అందుకోవటానికి 59 బంతులు మాత్రమే అవసరమయ్యాయి. హాఫ్ సెంచరీ తర్వాత కూడా హెడ్ పరుగుల ప్రవాహం ఎక్కడ తగ్గలేదు. మొత్తం 67 బంతులు ఎదుర్కొన్న హెడ్ 109 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ చేసిన రోహిత్ శర్మ రికార్డ్ ను హెడ్ బ్రేక్ చేసాడు. రోహిత్ ఇదే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 63 బంతుల్లో చేసిన రికార్డ్ ను తాజాగా హెడ్ బద్దలు కొట్టాడు. 

హెడ్ ఇన్నింగ్స్ లో మొత్తం 10 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్(109) హెడ్ మెరుపు సెంచరీకి తోడు వార్నర్ (81) రాణించడంతో 388 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, బోల్ట్ మూడు వికెట్లు తీసుకోగా.. సాంట్నర్ కు రెండు, నీషం,హెన్రీలకు ఒక వికెట్ దక్కింది.