తిరుమలలో భక్తులకు తప్పిన ప్రమాదం

తిరుమలలో భక్తులకు తప్పిన ప్రమాదం

తిరుపతి: తిరుమల ప్రెస్ క్లబ్ సెంటర్ లో భక్తులకు పెను ప్రమాదం తప్పిపోయింది. భక్తులకు ఉచిత రవాణా సేవలు అందిస్తున్న టిటిడి ఉచిత బస్సుపై భారీ చెట్టు కూలిపోయింది. ఊహించని రీతిలో ఒక్కసారిగా భారీ చెట్టు విరిగి పడడంతో బస్సు ముందు బాగం ధ్వంసం అయింది. భక్తులు, సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షణకాలంలో పెను ప్రమాదం తప్పిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.