EVM లతోపాటు 50 శాతం VVPAT యంత్రాల స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈసీ కౌంటర్ అఫడివిట్‌పై పిటిషనర్ తరఫు న్యాయవాదులు సమయం అడగడంతో జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును 8వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా NDAవ్యతిరేక కూటమికి చెందిన 21 రాజకీయ పార్టీలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. EVM ల ఓట్లకు VVPAT యంత్రాల స్లిప్పులు సరిపోల్చి చూడాల్సిందేనని ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో VVPATలను లెక్కిస్తేనే లెక్కింపు చాలా పారదర్శకంగా ఉంటుందంటూ వివిధ పార్టీల నేతలు పిటీషన్‌లో తెలిపారు.
