కర్రెగుట్టల్లో పేలిన మందు పాతర .. గిరిజనుడికి గాయాలు

కర్రెగుట్టల్లో పేలిన మందు పాతర .. గిరిజనుడికి గాయాలు
  • వెదురు బొంగుల కోసం వెళ్లగా ఘటన  

వెంకటాపురం, వెలుగు : తెలంగాణ – చత్తీస్ గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతమైన కర్రెగుటల సమీపంలో మందు పాతర పేలి గిరిజనుడు గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన ప్రకారం..  వెంకటాపురం మండలం పాత్రపురం పంచాయతీ ముకునూరు గ్రామానికి చెందిన వృద్ధుడు సోయం కామయ్య శుక్రవారం వెదురు బొంగులను తెచ్చేందుకు కర్రెగుట్టల సమీపంలోకి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలు వేయడంతో  పేలింది. దీంతో కామయ్య కాలికి తీవ్ర గాయమైంది. 

బాధతో అతడు కేకలు వేయడంతో పొయ్యిల కట్టెల కోసం వెళ్లిన అదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు చూసి  కుటుంబ సభ్యులకు తెలిపారు. సాయంత్రం ఘటన స్థలానికి వెళ్లగా.. రాత్రి కావడంతో జెట్టి కట్టి కామయ్యను గ్రామానికి తీసుకొచ్చారు. 5 కిలోమీటర్ల దూరానికి 4 గంటలు పట్టింది. అనంతరం రాత్రి 8:30 గంటలకు108లో మెరుగైన వైద్యం కోసం ములుగు ఆస్పత్రికి తరలించారు.