లంబాడీలకు స్టేట్​ కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చోటు కల్పించండి : రాహుల్‌కు గిరిజన శక్తి నేతల విజ్ఞప్తి

లంబాడీలకు స్టేట్​ కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చోటు కల్పించండి : రాహుల్‌కు గిరిజన శక్తి నేతల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీ సామాజిక వర్గానికి చోటు కల్పించేలా చొరవ చూపాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి గిరిజన శక్తి ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో గిరిజన శక్తి జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌహన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ రాహుల్ గాంధీని కలిసి, సమస్యలపై వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, పార్టీలో గిరిజనులకు ప్రాముఖ్యత కల్పించాలని కోరారు. లంబాడీలకు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించేందుకు కృషి చేయాలన్నారు. బంజారాలు మాట్లాడే గోర్ బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చాలని, పార్లమెంట్ ఆవరణలో లఖీష బంజారా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.