ఏసీబీకి పట్టుబడ్డ జ్యోతికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఏసీబీకి పట్టుబడ్డ జ్యోతికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని జ్యోతి స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో అనారోగ్య కారణంగా జ్యోతిని చికత్స కోసం ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఈసీజీ, బీపీ, బ్లడ్ టెస్ట్ లు, షుగర్, గుండెకి సంబంధించిన టెస్టులు చేశారు వైద్యులు. అన్ని టెస్టులు నార్మల్ గా వచ్చాయన్న  వైద్యులు తెలిపారు. జ్యోతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. ఆమెకు 2డీ ఈకో  టెస్ట్ చేసిన తర్వాత ఆమెను డిశ్చార్జి చేస్తామని అధికారులకు తెలిపారు.  డిశ్చార్జి అనంతరం అధికారిని జ్యోతిని ఏసీబీ అధికారులు జడ్జి ముందు ప్రవేశపెట్టి రమాండ్ కు తరలించే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం ఉదయం  ట్రైబల్ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈఈ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జగ జ్యోతి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. దాదాపు రూ.64 లక్షల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు జ్యోతిని అరెస్ట్ చేశారు. 

Also Read : విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవు