గిరిజనులపై దాడులను నియంత్రించాలి : గిరిజన ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక

గిరిజనులపై దాడులను నియంత్రించాలి : గిరిజన ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక

హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన, ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయని.. వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని గిరిజన ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. గిరిజన యువతపై జరుగుతున్న దాడులను ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నియంత్రించాలని కోరింది. 

హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో గిరిజన ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.  ఇటీవల అగ్రకులాల చేతిలో హత్యకు గురైన గిరిజన కుటుంబాలతో సమావేశమయ్యారు. ఆరు హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సమావేశంలో డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల సభ్యులకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సత్వర న్యాయం జరగకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రాజ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, బాధిత కుటుంబాలు, మాజీ మంత్రి ధరావత్ రవీంద్ర నాయక్, ప్రొఫెసర్ చంద్రు నాయక్, ఉస్మానియా విద్యార్థి నాయకుడు సంపత్ నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు పివి రమణ, గిరిజనశక్తి  నాయకులు వెంకటేష్ చౌహన్, శ్రీరామ్ నాయక్, ఉస్మానియా విద్యార్థి నాయకులు మహిపాల్ యాదవ్, విక్రమ్ గౌడ్, శ్యామ్ యాదవ్, ధరవత్ వెంకటేష్, వెంకటేశ్ బంజారా, అశోక్, మహిళా సంఘం ప్రతినిధులు ఇందిర, విమల, బత్తుల రాంప్రసాద్, సత్యం నాయక్,శంకర్ నాయక్, నాగేందర్, బాలు, మాల మహానాడు భాస్కర్, గోపాల్, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.