ఆదివాసీ గ్రామాల్లో ఆకాడి పండుగ

ఆదివాసీ గ్రామాల్లో ఆకాడి పండుగ

జైనూర్, వెలుగు: ఆకాడి పండుగను ఆదివాసీలు ఘనంగా జరుపుకొన్నారు. గురువారం జైనూర్ మండలంలోని కాసిపటేల్ గూడా, లింగాపూర్ మండలంలోని జాముల్దార, గ్రామాల్లో ఆకాడి వేడుకలు నిర్వహించారు. ఆయా గ్రామాల కుల పెద్దలు సమీప అటవీ ప్రాంతంలో అడవితల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే వండిన అన్నంతో ఆకాడి లడ్డూలు తయారు చేశారు. పశువులను ఊరేగింపుగా తీసుకెళ్లి కాపరులకు నైవేద్యాన్ని అందించారు. సామూహిక భోజనాలు చేశారు. వనదైవం ఆశీస్సులు పొందేందుకు ఈ పూజలు చేస్తామని తెలిపారు.