అటవీ అధికారులు పత్తి మొక్కలు ధ్వంసం చేస్తున్నరు: గిరిజనుల

అటవీ అధికారులు పత్తి మొక్కలు ధ్వంసం చేస్తున్నరు:  గిరిజనుల
  • ఎమ్మెల్యే వినోద్​కు గిరిజనుల ఫిర్యాదు​

బెల్లంపల్లి రూరల్/తాండూరు, వెలుగు: కష్టపడి నాటుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పత్తి మొక్కలను అటవీ అధికారులు ధ్వంసం చేస్తున్నారని సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్​కు గిరిజనులు ఫిర్యాదులు చేశారు. నెన్నెల మండల కేంద్రంలో ఉన్న సర్వే నంబర్లు 671, 672లో ప్రభుత్వ భూమిలో 30 ఏండ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమకు పట్టాలు సైతం ఉన్నాయన్నారు. 

అటవీ అధికారులు సాగును అడ్డుకుంటూ, అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్​ అధికారులు పీకిన మొక్కలను ఎమ్మెల్యేకు చూపించారు. సమస్య తీర్చాలని వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే.. అటవీ అధికారులు ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు. కలెక్టర్​తో మాట్లాడుతానని, పోడు సమస్య పరిష్కరిస్తానని, పట్టాలు వచ్చేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వినోద్ ​అన్నారు. నెన్నెల, తాండూరులోని రైతు వేదికల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్​ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. 

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం పదేండ్లలో ఒక్క రేషన్​ కార్డు కూడా పంపిణీ చేయలేదన్నారు. మండలంలో ఇప్పటి వరకు 600 రేషన్​ కార్డులు మంజూరయ్యాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్లు​జ్యోతి, జ్యోత్న్స, ఎంపీడీవో అబ్దుల్, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.