భద్రాద్రి ఆలయంలో సేవా యాత్ర ప్రారంభించిన గిరిజనులు

భద్రాద్రి ఆలయంలో సేవా యాత్ర ప్రారంభించిన గిరిజనులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీతారామ చంద్ర స్వామి ఆలయం పురవీధుల్లో దమ్మక్క సేవ యాత్రను ఆలయ అధికారులు, పూజారులు నిర్వహించారు. గుడి నుంచి ప్రధాన వీధులలో ఈ యాత్రను నిర్వహించారు. పోకల దమ్మక్క సేవ యాత్రను గిరిజన భక్తులతో ఆలయ అధికారులు ప్రారంభించారు.

రాములవారి ఈ యాత్రలో పాల్గొనేందుకు పరిసర గిరిజన గ్రామాల నుంచి భారీగా వచ్చారు గిరిజనులు. దమ్మక్క చిత్ర పటంతో గిరి ప్రదక్షణలు చేశారు. గిరిజనుల కొమ్ము నృత్యాలు అలరించాయి. పోకల దమ్మక్క పేరిట ప్రతి ఏటా సేవ యాత్రను నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు.