
పొలిమేర, రజాకార్ వంటి చిత్రాలతో కెమెరామెన్‌గా గుర్తింపును అందుకున్నారు కుశేందర్ రమేష్ రెడ్డి. తాజాగా ఆయన సినిమాటోగ్రాఫర్‌గా చేసిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట సింహా లీడ్ రోల్స్‌లో మోహన్ శ్రీవత్స దర్శకుడిగా విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత ఉంటుంది.
ఒక్కో పాత్రకు సపరేట్ కలర్ గ్రేడింగ్ వాడాం. సీన్స్ అన్ని ఎంతో సహజంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. తెలుగులో ఇలాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచేలా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పాడు.