
మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు బార్బరీకుడు పాత్ర ఆధారంగా మోహన్ శ్రీవత్స రూపొందించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించగా, దర్శకుడు మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి నిర్మించారు. ఆగస్టు 29న సినిమా రిలీజ్.
ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ ‘ఇదొక కంటెంట్ బేస్డ్ మూవీ. ఈ కథలో చాలా లేయర్స్ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు మైథలాజికల్ టచ్ ఇచ్చాను. ఇందులోని ప్రతి పాత్రకు భిన్న పార్శ్వాలు ఉంటాయి. సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట సహా అందరూ అద్భుతంగా నటించారు.
సత్య రాజ్ గారు బార్బరికుడిలా కొన్నిచోట్ల కనిపిస్తారు. ఈ చిత్రంలో హీరో, విలన్ అని ఉండరు. అన్ని పాత్రల్లోనూ పాజిటివ్, నెగిటివ్ యాంగిల్స్‌తో పాటు అంతర్గత యుద్ధం జరుగుతుంటుంది. తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తుంటాం. అన్ని ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకునే వాడు గొప్ప మనిషి అనే సందేశాన్ని ఈ చిత్రంతో ఇవ్వబోతున్నాం.
నేను సంగీతాన్ని నేర్చుకున్నా కూడా. నాకు సినిమాలోకి రావాలని, దర్శకుడు కావాలన్నదే నా కల. ఎన్నో ఈవెంట్లలో పాటలు కూడా పాడేవాడిని. అదే నాకు ఇన్ని రోజులు తిండి పెట్టిందని’దర్శకుడు మోహన్ శ్రీవత్స తన అనుభవాలు పంచుకున్నారు.