
కామారెడ్డిటౌన్, వెలుగు : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొపెసర్ కోదండరాంను శనివారం హైదరాబాద్లో కామారెడ్డి జిల్లా తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్రతినిధులు సన్మానించారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం పట్ల అభినందనలు తెలిపారు. స్టేట్ సెక్రటరీ నిజ్జన రమేశ్, జిల్లా ప్రెసిడెంట్ కుంబాల లక్ష్మణ్, ప్రతినిధులు రజినీకాంత్, మధు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.