పదవీ విరమణ చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సన్మానం

పదవీ విరమణ చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సన్మానం

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ సీపీఆర్వో విభాగంలో పనిచేసిన అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ జి జీవన్ కుమార్, మోటార్‌ సైకిల్ ఆర్డర్లీ అబ్దుల్ సత్తార్ మంగళవారం పదవీ విరమణ పొందారు. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్​గా పనిచేసిన జీవన్ కుమార్, అంతకుముందు సీపీఆర్వో విభాగంలో సేవలు అందించారు. అబ్దుల్ సత్తార్ కూడా అదే విభాగంలో మోటార్‌సైకిల్ ఆర్డర్లీగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా పీఆర్​వో మామిండ్ల దశరథం, మాజీ సీపీఆర్వో మహ్మద్ మూర్తుజా, సూపర్​వైజర్, ఇతర సిబ్బంది పదవీ విరమణ పొందిన వీరిద్దరిని సన్మానించారు.