- కలెక్టర్ సత్యప్రసాద్.
జగిత్యాల టౌన్, వెలుగు:గొప్ప నాయకుల జీవితం మనందరికీ ఆదర్శమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్‌లో ఆయన ఫొటో వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోశయ్య ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా అందించిన సేవలు మరవలేనివన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లత, రాజగౌడ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ డీసీసీ ఆఫీస్‌లో..
కరీంనగర్ సిటీ, వెలుగు: మాజీ సీఎం రోశయ్య నాలుగో వర్ధంతిని కరీంనగర్ డీసీసీ ఆఫీస్‌లో కాంగ్రెస్ లీడర్లు నిర్వహించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లీడర్లు కంకణాల అనిల్ కుమార్ గుప్తా , శ్రావణ్‌నాయక్, కొరివి అరుణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సలీముద్దీన్, రెహమాన్, అనిల్, రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
