నల్ల నర్సింహులుకు నివాళి

నల్ల నర్సింహులుకు నివాళి

జనగామ అర్బన్, వెలుగు: నల్ల నర్సింహులు 32వ వర్ధంతిని సందర్భంగా బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ ఆఫీస్​ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు, సీపీఐ కార్యకర్తలు, అభిమానులు, పద్మశాలీ కుల బంధువులు నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మనుమడు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నల్ల నర్సింహులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ప్రారంభించారని, నిజాం సైనికులు రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.