ట్రైకార్ యాక్షన్ ప్లాన్కు బోర్డు ఆమోదం .. రూ.2,370 కోట్లతో గిరిజనులకు వివిధ స్కీమ్ లు అమలు

ట్రైకార్ యాక్షన్ ప్లాన్కు బోర్డు ఆమోదం .. రూ.2,370 కోట్లతో గిరిజనులకు వివిధ స్కీమ్ లు అమలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గిరిజనులకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2370 కోట్లతో వివిధ స్కీమ్స్ అమలు చేసేందుకు ట్రైకార్  (తెలంగాణ ట్రైబల్  కోఆపరేటివ్ ఫైనాన్స్  కార్పొరేషన్)  బోర్డు ఆమోదం తెలిపింది. శనివారం మాసబ్  ట్యాంక్  సంక్షేమ భవన్ లో చైర్మన్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన ట్రైకార్ బోర్డు మీటింగ్ జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్  సెక్రటరీ శరత్ తో పాటు  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చైర్మన్  బెల్లయ్య నాయక్  మాట్లాడుతూ.. ఈ ఏడాది 1లక్షా 40,243 వేల  మంది గిరిజనులకు  రాజీవ్ యువ వికాసం ద్వారా లోన్లు ఇస్తున్నామని తెలిపారు. 

గిరిజన రైతులకు సోలార్ పవర్, ఉచిత మోటార్ అందజేస్తున్నామని చెప్పారు. ట్రైబల్  యువతకు స్కిల్  డెవలప్ మెంట్  కోర్సుల్లో శిక్షణ ఇస్తామని, సొంతగా వ్యాపారం స్థాపించుకునేందుకు సీఎం ఎస్టీ ఎంట్రపెన్యూర్ షిప్ , ఇన్నొవేషన్  స్కీమ్  కింద తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తున్నట్లు చైర్మన్  బెల్లయ్య నాయక్  వెల్లడించారు.