చార్లీ కిర్క్ ను ఎందుకు చంపానంటే..రాబిన్సన్ సంచలన విషయాలు వెల్లడి

చార్లీ కిర్క్ ను ఎందుకు చంపానంటే..రాబిన్సన్ సంచలన విషయాలు వెల్లడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కు అత్యంత సన్నిహితుడు, టర్నింగ్ పాయింట్ USA వ్యవస్థాపకుడు 31 ఏళ్ల కిర్క్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిర్క్​ ను ఎందుకు హత్య చేశాడో నిందితుడు రాబిన్సన్​సంచలన విషయాలు వెల్లడించాడు. హత్యకు సంబంధించి తన స్నేహితుడితో పంచుకున్న మేసేజ్​ పోలీసులకు చిక్కాయి. 

గత వారం ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా కిర్క్​ ను తుపాకీతో కాల్చిచంపారు గుర్తుతెలియని వ్యక్తులు. అయితే చార్లీ కిర్క్‌ను హత్య చేసినట్లు అనుమానిస్తున్న టైలర్ రాబిన్సన్ ను గురువారం అర్థరాత్రి ఉటాలోని దక్షిణ ప్రాంతంలోని సెయింట్ జార్జ్ సమీపంలో అరెస్టు చేశారు. కాల్పులు జరిగిన ప్రదేశానికి నైరుతి దిశలో దాదాపు 390 కిలోమీటర్లు దూరంలో నిందితుడు రాబిన్సన్​ ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపర్చారు. 

చార్లీ కిర్క్‌ను కాల్చి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తన రూమ్‌మేట్‌కు పంపిన మేసేజ్​లో మితవాద కార్యకర్తను చంపినట్లు అంగీకరించాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.అతనిపై ఏడు కేసులు అభియోగాలు మోపారు. 

కాల్పులకు గల స్పష్టమైన ఉద్దేశ్యాన్ని అధికారులు వెల్లడించనప్పటికీ కోర్టు సమాచారంప్రకారం.. రాబిన్సన్ రూమ్‌మేట్‌కు కిర్క్ గురించి ఒక టెక్స్ట్‌లో కిర్క్​ను కాల్చి చంపాను.ద్వేషం తీరిపోయింది అని రాశాడు. 

22 ఏళ్ల రాబిన్సన్​ హత్యకు వారం ముందే ప్రణాళిక వేసినట్లు అంగీకరించాడు. తన చేతితో రాసిన నోట్‌ కూడా పోలీసులకు లభించింది. రాబిన్సన్ తన రూమ్‌మేట్ అయిన తన భాగస్వామికి ఈ నోట్​ ను రాశాడని తెలుస్తోంది. చార్లీ కిర్క్​ ను చంపే అవకాశం వచ్చింది..దానిని సద్వినియోగం చేసుకుంటాను అని అర్థం వచ్చేలా ఆ నోట్​లో రాసినట్లు తెలుస్తోంది.