50  ఏళ్ల తర్వాత మూడు గ్రహాల కలయిక.. ఈ 3 రాశులపై ప్రభావం

50  ఏళ్ల తర్వాత మూడు గ్రహాల కలయిక.. ఈ 3 రాశులపై ప్రభావం

కర్మఫలాల ప్రదాత శని దేవుడి ఈ ఏడాది మొత్తం తన సొంత రాశి కుంభ రాశిలోనే సంచరిస్తాడు. కానీ తన కదలికలు మాత్రం మార్చుకుంటూ ఉంటాడు. గ్రహాల గమనం సమయంలో ఒకే రాశిలోకి అనేక గ్రహాలు రావడం జరుగుతుంది. 50 ఏళ్ల తరువాత శని, శుక్ర, బుధ గ్రహాలు కలవబోతున్నాయి.జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ మూడు గ్రహాల కలయిక ఏ రాశుల వారికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం. . .

శని సంచరిస్తున్న కుంభ రాశిలోకి సంపదకు కారకుడు శుక్రుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రవేశించబోతున్నారు. దీని వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. ప్రస్తుతం శని సంచరిస్తున్న కుంభ రాశిలోకి త్వరలోనే తెలివితేటలు, కమ్యూనికేషన్ కి ప్రాతినిధ్యం వహించే గ్రహాల రాకుమారుడు బుధుడు.... సంపద, శ్రేయస్సు, విలాసానికి ప్రతీక అయిన శుక్రుడు ప్రవేశించబోతున్నారు.  అంటే కుంభరాశిలో శని, శుక్ర, బుధ గ్రహాలు కలవబోతున్నాయి.    దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగబోతుంది. అంతేకాదు శని సుమారు 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మార్చి నెలలో శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా కుంభ రాశిలో శని, శుక్ర, బుధ గ్రహాలు కలుసుకోవడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. శని, శుక్ర కలయికతో  రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. శని శష రాజయోగం, శుక్రుడు మాలవ్య రాజయోగం ఇవ్వబోతున్నాయి. 

కుంభ రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు పెద్ద గ్రహాల కలయిక జరగబోయేది కుంభ రాశిలోనే. అందువల్ల త్రిగ్రాహి యోగం కుంభ రాశి జాతకులకి చాలా ప్రయోజనాలు ఇవ్వబోతుంది. శని చల్లని చూపు ఈ రాశి వారి మీద ఇప్పటికే ఉంది. ఇక సంపదని ఇచ్చే శుక్రుడు రావడం వల్ల మీరు డబ్బుకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సంపద పెరిగి ధనవంతులు అవుతారు. ధనం, సౌభాగ్యం లభిస్తాయి. అదృష్టవంతులు కాబోతున్నారు. ఈ రాశిలో బుధుడు సంచారం వల్ల ఈ రాశి జాతకులు తమ తెలివితేటలు, సామర్థ్యంతో సమాజంలో గౌరవం పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. కెరీర్ పరంగా కోరుకున్న జాబ్ మీకు దక్కుతుంది.

మిథునరాశి

త్రిగ్రాహి యోగం ఫలితంగా మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. శ్రమకి తగిన ఫలితం పొందుతారు. అవసరమైన సమయంలో మీ కుటుంబం మీకు మద్దతుగా నిలుస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఇది మంచి సమయం.గతంలో ఎదుర్కొన్న అనేక సమస్యలు సమసిపోతాయి. డబ్బుకి సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. ఆకస్మికంగా ధనం చేతికి వస్తుంది. వ్యాపారస్తులకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి లాంగ్ ట్రిప్ కి బయటకి వెళతారు.ఆర్థిక సమస్యలతో బాధ పడే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. 

వృషభ రాశి

కుంభ రాశిలో మూడు గ్రహాల కలయిక ఫలితంగా ఏర్పడే త్రిగ్రాహి యోగం వృషభ రాశి వారికి శుభ ఫలితాలు అందిస్తుంది. ఈ యోగం వల్ల ఈ రాశి వారికి ధన కొరత తీరుతుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అప్రమత్తగా ఉండాలి. ఉద్యోగంలో మీ పని తీరుకి ప్రశంసలు దక్కుతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఆశించినంత మేర లాభాలు వస్తాయి.  కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టాలని పండితులు సూచిస్తున్నారు.  ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి.