త్రిగుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జంగా’. ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెవిన్ గడ్డం (శ్రీహరి) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిగుణ్ రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నాడు.
తాజాగా విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. నేహా పఠాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్, గగన్ విహారి, రఘు కారుమంచి, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
