తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల లిస్ట్ ఇదే

తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల లిస్ట్ ఇదే

బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని 42 ఎంపీ స్థానాలకుగాను TMC అభ్యర్థులను డిక్లేర్ చేశారు ఆపార్టీ అధినేత మమతా బెనర్జీ. కోల్ కతా బ్రిగేడ్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ జన గర్జన్ సభలో MP అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేశారు. 

ALSO READ :- నాచారం శివాలయంలో విగ్రహాల ధ్వంసం

అయితే వివాదాస్పద మాజీ ఎంపీ మహువా మోయిత్రాకు మళ్లీ టికెట్ ఇచ్చింది టీఎంసీ. ప్రముఖ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కు ఎంపీ టికెట్ ప్రకటించారు. MP టికెట్లలో కొత్త వారికి చాన్స్ తోపాటు ఇదివరకే ఉన్న అభ్యర్థుల పనితీరు, SC,ST ఆదివాసీలు, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. అటు 2019 లోక్ సభ ఎన్నికల్లో TMC 22 సీట్లు, BJP 18 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందింది.