చీర కట్టి.. ఫుట్‍బాల్ ఆడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ

చీర కట్టి.. ఫుట్‍బాల్ ఆడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ

ఓ మహిళా ఎంపీ చీరకట్టులో ఫుట్ బాల్ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలను స్వయానే ఆమే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల ప్రారంభమైన కృష్ణానగర్ ఎంపీ కప్ టోర్నమెంట్‌ను లాంచ్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా...  చీరలో ఫుట్‌బాల్ ఆడారు. దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలలో ఆమె ఎరుపు-నారింజ రంగు చీరతో పాటు స్పోర్ట్స్ షూస్, సన్ గ్లాసెస్‌ను ధరించారు. మొదటి చిత్రంలో ఆమె బంతిని తన్నడాన్ని చూడవచ్చు. తరువాత ఫొటోలో ఆమెను గోల్ కీపర్‌గా చూడవచ్చు.

కృష్ణానగర్ MP కప్ టోర్నమెంట్ 2022 ఫైనల్ లో కొన్ని సరదా క్షణాలు అంటూ ఈ ఫొటోలసను షేర్ చేసిన మహువా మొయిత్రా...  అవును, నేను చీరలో ఆడతాను అని రాసుకొచ్చారు. ఎంపీ చీర కట్టుకుని ఫుట్ బాల్ ఆడుతున్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకు మునుకు ఓ సారి కూడా ఆమె ఇలా చీర కట్టుకొని ఫుట్ బాల్ ఆడారు. పశ్చిమ బెంగాల్ లో ఏర్పాటు చేసిన ఖేలా హూబే దివస్ సందర్భంగా అప్పుడు మహువా మొయిత్రా చీరలో ఫుట్ బాల్ ఆడి అందర్నీ ఆకర్షించారు.