
కోల్‌కతా: వారణాసిలో ప్రధాని మోడీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీకి దిగుతారని ఆ పార్టీ సీనియర్ నేత మహువా మోయితా అన్నారు. దీదీ పోటీ చేస్తున్న నందిగ్రాంలో ఆమెకు ఓటమి తప్పదని.. మమత మరో నియోజకవర్గాన్ని చూసుకోవాలని మోడీ రీసెంట్ గా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల మీద టీఎంసీ నేతలు ఫైర్ అవుతున్నారు. మోడీ నియోజకవర్గమైన వారణాసిలో ఆయనకు ప్రత్యర్థిగా దీదీ బరిలోకి దిగుతారని మహువా మోయితా చెప్పారు. మమతను ఎదుర్కొనేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. నందిగ్రాంలో మమత విజయఢంకా మోగించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.