పాత అలైన్మెంటే అమలు చెయ్యాలి..ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితుల డిమాండ్

పాత అలైన్మెంటే అమలు చెయ్యాలి..ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితుల డిమాండ్

హైదరాబాద్​సిటీ, వెలుగు: ట్రిపుల్ ఆర్ (రీజనల్ రింగ్ రోడ్) ప్రాజెక్టుకు సంబంధించి గతంలో హెచ్ఎండీఏ ఇచ్చిన పాత అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్​నే అమలు చేయాలని ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితుల సంఘం డిమాండ్ చేసింది. పాత అలైన్​మెంట్​ను​ మార్చి కొత్త అలైన్​మెంట్​ఇవ్వడం సరికాదని, పాత అలైన్​మెంట్ ప్రకారమే రీజనల్ రింగ్​రోడ్​నిర్మించాలని కోరింది. 

సోమవారం ఆ సంఘం ప్రతినిధులు ప్రాజెక్ట్స్​చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డిని కలిసి, కొత్త అలైన్​మెంట్​పై అభ్యంతరాలు తెలిపారు. హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ నోటిఫికేషన్​లో మ్యాప్​లు ప్రదర్శించలేదని, వెబ్​సైట్‌‌‌‌‌‌‌‌లో జియో కోఆర్డినేట్స్ అర్థం కాని విధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్​నగర్ జిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు